ప్రపంచంలోని సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తూనేవుంటుంది. దీన్ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తర్వాత అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజాగా వాట్సాప్ మనీ ట్రాన్స్‌ఫర్‌ను ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, త్వరలోనే మరో ఫీచర్ అందుబాటులోకి వస్తున్నట్టు ఎక్స్‌డీఏ టెక్నాలజీ తెలియజేసింది. ఇప్పటివరకు వాట్సాప్‌లో గ్రూప్స్ ఉన్నాయిగాని, గ్రూప్ చాటింగ్ పౌకర్యం లేదు. ఈ గ్రూప్ చాటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
ప్రస్తుతం ఈ వెర్సన్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు ఎక్స్‌డీఏ తెలియజేసింది. టెస్టింగ్ ఫార్మాట్ పూర్తయ్యాక అందుబాటులోకి తీసుకొస్తామని, తప్పకుండా ఈ న్యూ గ్రూప్ ఛాటింగ్ సౌకర్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఎక్సడీఏ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ కమ్యునిటీ ఫీచర్ అందుబాటులోకి వస్తే గ్రూప్‌లో చేస్తున్న మెసేజింగ్ విధానం పూర్తిగా మారిపోతుందని, గ్రూప్ చాటింగ్ విధానం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎక్స్‌డీఏ ప్రతినిధులు చెబుతున్నారు.