వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్

Webdunia
మంగళవారం, 12 మే 2020 (10:01 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ వెబ్‌లో కొత్త ఫీచర్ రానుంది. మెసేంజర్ రూంలతో వీడియో కాల్స్‌ను పరిచయం చేయనుంది. 

జూమ్ లాంటి ఇతర వీడియో ప్లాట్ ఫాంలకు ధీటుగా ఫేస్‌బుక్ గత నెలలో వీడియో కాన్ఫిరెన్స్ టూల్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాన్ని వాట్సప్ వెబ్ వర్షన్‌లోనూ చూడబోతున్నట్లు ప్రకటించింది. తాజాగా వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. వాట్సప్ వెబ్ వర్షన్ 2.2019.6 ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
 
మెసేంజర్ రూంల ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవ్వొచ్చని.. అది కూడా పీసీలు, ల్యాప్‌టాప్‌ల నుంచే కుదురుతుందని వాట్సాప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆప్షన్ అటాచ్ బటన్ పక్కనే ఇతర ఆప్షన్లతో పాటు కనిపిస్తుందని సమాచారం. ఈ న్యూ వర్షన్ యూజర్లందరికీ అందుబాటులో లేదు. 
 
డెవలప్‌మెంట్‌లోనే ఉండటంతో వాట్సప్ వెబ్, డెస్క్‌టాప్ అప్‌డేట్‌కు మరికొంత సమయం పడుతుంది. రిపోర్టు మేరకు వాట్సప్ యూజర్లకు ఫీచర్ అప్‌డేట్స్ ద్వారా న్యూ ఫీచర్ అందుబాటులోకి రావొచ్చు.

WABetaInfo చేత గుర్తించబడిన రాబోయే ఈ ఫీచర్ పెద్ద సమూహాలతో వీడియో కాల్స్ చేయడానికి మేసెంజర్ రూమ్‌ల వైపుకు మళ్ళిస్తుంది. ఇందుకు ఫేస్‌బుక్ సపోర్ట్ వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments