వాట్సాప్‌ నుంచి సరికొత్త ఫీచర్‌-వాట్సప్ ప్రైవేట్ కాదా?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:18 IST)
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. తాజాగా వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ తీసుకొస్తోంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ను తిరిగి యూజర్లకు అందుబాటులోకి రానుంది. చివరిసారిగా వాట్సాప్‌ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్‌సీన్‌ సెట్టింగ్‌లో అప్‌డేట్‌ను తీసుకురానుంది.
 
ఈ ఆప్షన్‌ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. గుడ్‌ న్యూస్‌తో పాటు మరో బ్యాడ్‌ న్యూస్‌ కూడా షేర్‌ చేసింది వాట్సాప్‌. త్వరలోనే ఓల్డ్ ఫోన్ యూజర్లకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. కొన్ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపి వేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. 
 
ఆండ్రాయిడ్ 4.0.3, అంతకంటే తక్కువ వెర్షన్ పై నడుస్తున్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నవంబరు 1 నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. అలాగే ios 9 లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ వెర్షన్ పై పనిచేస్తున్న అన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని ప్రకటించింది.
 
మరోవైపు తాజా రిపోర్టుల ప్రకారం ఫేస్బుక్ వాట్సప్ ప్రైవేట్ కాదని తెలుస్తోంది. వాట్సాప్ చెప్పిన దాని ప్రకారం ఎవరైతే మెసేజ్ పంపిస్తారో వాళ్లు మరియు ఎవరికైతే మెసేజ్ పంపిస్తారో వాళ్లు మాత్రమే ఆ సమాచారాన్ని చూడగలరని…. కనీసం వాట్సాప్ కూడా ఈ మెసేజ్లు, ఇతర సమాచారాన్ని చూడదు అని చెప్పడం జరిగింది. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
 
ఎఫ్‌బీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కూడా కంపెనీ ఎలాంటి వాట్సాప్ మెసేజ్లు చూడదు అని చెప్పారు. అలానే 2018లో వాట్సప్‌లో ఎలాంటి కంటెంట్ కూడా మేము చూడమని వాళ్ళు వెల్లడించారు. వాట్సప్ అనేది ఎంతో పాపులర్ యాప్ అని మనకి తెలుసు. చాలా మంది వాట్సాప్‌ని రోజు వాడుతున్నారు.
 
మీ మెసేజ్లు మరియు మీ ఫోన్ కాల్స్ కూడా ఎంతో భద్రంగా ఉంటాయని మేము వినమని, చూడమని అప్పట్లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రో పబ్లిక్ రిపోర్టు ప్రకారం అవి నిజం కాదని తెలుస్తోంది. వాట్సాప్‌కి వెయ్యి మందికి పైగా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారని… ఆస్టిన్, టెక్సస్, సింగపూర్ ప్రాంతాలలో వాళ్లు ఉన్నట్లు కంటెంట్ ని చూస్తారని తెలుస్తోంది. 
 
అయితే ఎవరైనా వాట్సాప్‌లో రిపోర్ట్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు వాట్సాప్ ఆ ప్రైవేట్ చాట్ ఓపెన్ చేసి చూస్తుందని తెలుస్తోంది. పేరు, స్టేటస్, ఫోన్ నెంబర్, ప్రొఫైల్ ఫోటో చూడచ్చని.. వాట్సాప్ కి రిలేటెడ్ వున్న ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఎకౌంట్స్ కూడా చూసే అవకాశం ఉందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments