వాట్సాప్‌లో డార్క్ మోడ్.. హమ్మయ్య ఇక కంటికి మేలే

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (17:48 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్‌లో డార్క్ మోడ్ రాబోతోంది. ఫలితంగా కళ్లు భద్రంగా వుంటాయని సంస్థ ప్రకటించింది. రాత్రవేళ్లలో కళ్లకు శ్రమ తెలియకుండా చేసేందుకు వాట్సాప్ డార్క్‌మోడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. 
 
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆండ్రాయిడ్ వెర్షన్ రెడీ అయ్యిందని.. ఐవోఎస్ వెర్షన్ కూడా సిద్ధమవుతోందని వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లలో కొందరికి ఇప్పటికే డార్క్ మోడ్ అందుబాటులోకి వచ్చిందని బ్రిటన్ చెందిన ఓ వెబ్ సైట్ పేర్కొంది. 
 
డార్క్ మోడ్ వల్ల ప్రయోజనాలు.. 
* కంటికి మేలు చేకూరుతుంది. 
* కంటికి అలసట వుండదు. 
* సాధారణంగా ఇంటర్నెట్‌లో సమాచారమంతా తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో నల్లని అక్షరాల్లో ఉంటుంది.
 
తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో నల్లని అక్షరాలతో కంటికి విపరీతమైన శ్రమ ఏర్పడుతుంది. కానీ డార్క్ మోడ్ ద్వారా ఆ ఇబ్బంది వుండదు. ఈ డార్క్ మోడ్ ద్వారా నల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల రాత్రివేళ వాట్సాప్‌ను ఉపయోగించే వారి కళ్లకు శ్రమ తగ్గుతుందని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ విష్ణుప్రియతో నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు? జేడీ చక్రవర్తి ప్రశ్న

Heroes: హీరోల పారితోషికంలో సినిమారంగంలో పెను మార్పులు రాబోతున్నాయా?

Samantha: మా ఇంటి బంగారం లో నేనే హీరో అంటున్న సమంత

Dhanush: కర సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది : హీరో ధనుష్

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments