Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్ నుంచి కొత్తగా ఐదు ఫీచర్స్.. రీడ్ లేటర్.. వ్యూవ్ ఒన్స్ గురించి తెలుసా?

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (14:36 IST)
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వాట్సప్ వాడేవారి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫీచర్స్‌ని రూపొందిస్తూ ఉంటుంది వాట్సప్. ఈ ఫీచర్స్ యూజర్లను బాగా ఆకట్టుకుంటాయి కూడా. అలాంటి మరిన్ని ఫీచర్స్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. మల్టీ డివైజ్ సపోర్ట్, మిస్డ్ గ్రూప్ కాల్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.  
 
డిసపరింగ్ మోడ్ : వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్రూప్స్‌కి మాత్రమే ఈ ఫీచర్ ఉంది. త్వరలో అన్ని ఛాట్ థ్రెడ్స్‌కి ఈ ఫీచర్ తీసుకురానుంది వాట్సప్. అంటే ప్రతీ ఛాట్‌కు డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆన్ చేసుకోవచ్చు.
 
మల్టిపుల్ డివైజ్ సపోర్ట్: మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను రెండుమూడు నెలలుగా పరీక్షిస్తోంది వాట్సప్. అయితే ఈ ఫీచర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తామని వాట్సప్ ప్రకటించింది. ఒకట్రెండు నెలల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో మీరు ఒకే వాట్సప్ అకౌంట్‌ను వేర్వేరు డివైజ్‌లల్లో లాగిన్ కావొచ్చు.
 
రీడ్ లేటర్: రీడ్ లేటర్ ఫీచర్‌ను కూడా తీసుకురాబోతోంది వాట్సప్. ముఖ్యమైనవి కాని మెసేజెస్, ఛాట్స్‌ని మీకు వీలైనప్పుడు చదవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
 
మిస్డ్ గ్రూప్ కాల్స్: గ్రూప్ కాల్స్ మిస్ అయ్యారా? మిస్డ్ గ్రూప్ కాల్ ఫీచర్‌తో ఆ గ్రూప్ కాల్స్‌లో జాయిన్ కావొచ్చు. ప్రస్తుతం గ్రూప్ కాల్ వచ్చినప్పుడు జాయిన్ కాకపోతే ఆ తర్వాత చేరడానికి వీల్లేదు.
 
వ్యూవ్ ఒన్స్: వాట్సప్‌లో వచ్చే ఫోటోలు, వీడియోలతో మీ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ నిండిపోతుందా? త్వరలో ఈ సమస్యకు పరిష్కారం రాబోతోంది. వ్యూ వన్స్ ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్‌తో మీరు ఫోటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేయకుండా ఒకసారి చూస్తే సరిపోతుంది. డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments