Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ గ్రూపులో మీరు ఏ కేటగిరీకి చెందినవారు?

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (11:28 IST)
ప్రస్తుత కాలంలో వాట్సాప్ గురించి తెలియనివాళ్లు ఉండరు. స్మార్ట్ ఫోన్ యూజర్లకు అంతలా వినియోగదారులకు వాట్సాప్ చేరువైంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్‌తో వినియోగదారులను కూడా వాట్సాప్ ఆకట్టుకుంటోంది. అలాంటి వాట్సాప్‌ను ఉపయోగించే వారిలో మీరూ ఒకరై వుండొచ్చు. వాట్సాప్‌ యూజర్లు వివిధ గ్రూపులు క్రియేట్ చేసి వాటి ద్వారా తమ సందేశాలను షేర్ చేస్తుంటారు. అయితే, మీరూ ఏ కేటగిరీకి చెందినవారో ఇక్కడ తెలుసుకుందాం. 
 
వాట్సాప్ రూస్టర్ : ఈ గ్రూపునకు చెందిన వారు తనకి తెలిసిన అందరికీ ప్రతిరోజూ పొద్దున్నే గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌ పంపిస్తే కాని వీళ్ళకి తెల్లారదు. 
వాట్సాప్‌ బాబా : ఆధ్యాత్మికమైన మెసేజ్‌లు, దేవుడి ఫొటోలు వాట్సాప్‌లో పెడితే కాని వీరి మనసు కుదుట పడదు.
వాట్సాప్‌ దేవదాసు : వీళ్ళెప్పుడూ బాధాకరమైన, విచారంగా వుండే మెసేజ్‌లే పెడుతుంటారు.
వాట్సాప్‌ న్యూస్‌ రిపోర్టర్‌ : ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని అప్‌డేట్‌ చేస్తుంటారు వీళ్ళు.
 
వాట్సాప్‌ దొంగ : మరెవరో పంపించిన మెసేజ్‌లని వీరు ఫార్వర్డ్‌ చేస్తూ వుంటారు.
వాట్సాప్‌ విదూషకులు : ఎప్పుడూ ఎదుటివాళ్ళని తమ మెసేజ్‌లతో నవ్వించాలనుకుంటారు.
వాట్సాప్‌ మౌనిబాబా : తమకి వచ్చే ప్రతి ఒక్క మెసేజ్‌ చదువుతారు కానీ ఎప్పుడూ రిప్లై ఇవ్వరు.
 
వాట్సాప్‌ చాటర్‌ : వీళ్ళెప్పుడూ ఆన్‌లైన్లోనే ఉంటారు కానీ ఎవ్వరితోనూ చాట్‌ చేయరు.
వాట్సాప్‌ థింకర్స్‌ : తాము పంపించే ఆలోచనాత్మక మెసేజ్‌లతో మిగతావారిని మార్చాలనుకుంటారు.
వాట్సాప్‌ ఆల్‌రౌండర్‌ : వీళ్ళు తమ అభిప్రాయాల్ని ఇతరులతో పంచుకుంటారు, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు.
వాట్సాప్‌ రచయితలు : వీరు తమ కవితాత్మక మెసేజ్‌లతో ఎదుటివారికి బోర్‌ కొడతారు (ఎవరేమనుకున్నా సరే తాము మాత్రం మారరు).

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments