కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన శాంసంగ్, వన్ ప్లస్‌లు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (16:28 IST)
One plus
శాంసంగ్, వన్ ప్లస్‌లు కస్టమర్లకు క్షమాపణలు చెప్పాయి. ప్రస్తుతం శాంసంగ్  గెలాక్సీ ఎస్ 22తో పాటు గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8 సిరీస్‌లో యాప్ లు బాగా స్లో అయ్యాయి. వాటి పనితీరు మందగించింది. దీంతో ఆ సంస్థ చీఫ్ స్వయంగా క్షమాపణ అడిగారు. 
 
ఫోన్లలో గేమింగ్ పెర్ఫార్మెన్స్ పెంచడం కోసం సంస్థలు ప్లే స్టోర్‌లోనే వివిధ యాప్‍ల పనితీరు సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నాయి. తద్వారా బ్యాటరీ లైఫ్‌ను పెంచడంతో పాటు గేమ్‌లకు అనువుగా సాఫ్ట్ వేర్‌ను మరింత శక్తిమంతంగా మారుస్తున్నాయి. ఈ కారణంగా వన్ ప్లస్, శాంసంగ్ ఫోన్లు స్లో అయ్యాయి. 
 
ఇప్పటికే గూగుల్, క్రోమ్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, నెట్ ఫ్లిక్స్, జూమ్ వంటి 10 వేల యాప్ లను ‘యాప్ థ్రాట్లింగ్’ జాబితాలో శాంసంగ్ చేర్చినట్టు తెలుస్తోంది.
 
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22లో గేమ్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్ వేర్ ఇన్ బిల్ట్ గా వస్తోంది. ఈ నేపథ్యంలోనే 10 వేలకు పైగా యాప్ ల పనితీరు మందగించేలా చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ సమస్య నుంచి బయటపడేందుకు త్వరలోనే సాఫ్ట్ వేర్ అప్ డేట్ తీసుకొస్తున్నామని, గేమ్ లాంచర్ యాప్ లో గేమ్ బూస్టర్ ల్యాబ్ అనే ఆప్షన్ ను తీసుకొస్తున్నట్టు శాంసంగ్ తెలిపింది. 
 
అయితే తాము బ్యాటరీ లైఫ్‌ను పెంచేందుకు, ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వీలుగానే యాప్ థ్రాట్లింగ్ ను చేశామని పేర్కొన్న సంస్థ.. వినియోగదారులకు సారీ చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments