Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ తప్పూ చయలేదు... ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు : టిక్ టాక్ ఇండియా

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (10:15 IST)
భారత సార్వభౌమత్వానికి, గోప్యతకు విఘాతంగా మారాయన్న కారణంతో టిక్ టాక్, షేరిట్ వంటి అత్యంత పాప్యులర్ యాప్స్ సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. దీనిపై టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ స్పందించారు. తాము ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరుగలేదని స్పష్టం చేశారు. 
 
"భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నాం. భారత యూజర్లకు చెందిన సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోలేదు" అని ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని, తమ అభ్యంతరాలను తెలియజేస్తామని, ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేస్తామని ఆయన అన్నారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌ను వాడకుండా నిషేధం విధించినా, ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవడం, అన్ని స్మార్ట్ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తీసేయడం అనుకున్నంత సులువు కాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
వీటిని డౌన్‌లోడ్ చేసుకున్న వారు వాడకుండా చూడటం చాలా కష్టమని అంటున్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లు వీటిని ఇప్పటికే తొలగించగా, యాప్స్‌కు సంబంధించిన వెబ్ సైట్లు, ఇతర వెబ్ సైట్ల నుంచి 'ఏపీకే'లను డౌన్ లోడ్ చేసుకుని వాడుకునే వారు వాడుకుంటూనే ఉంటారని నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments