Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూటీఎస్ మొబైల్ యాప్-జనరల్, ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు..

యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ వచ్చేసింది. రిజర్వేషన్ లేని జనరల్ టిక్కెట్లను ఇకపై స్మార్ట్‌ఫోన్ల నుంచి క్షణాల్లో తీసుకునే అవకాశాన్ని కల్పించే దిశగా దక్షిణ మధ్య రైల్వే యాప్‌ను రూపొందించింది. ఈ యూటీఎస్ ఆన

Webdunia
గురువారం, 12 జులై 2018 (18:30 IST)
యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ వచ్చేసింది. రిజర్వేషన్ లేని జనరల్ టిక్కెట్లను ఇకపై స్మార్ట్‌ఫోన్ల నుంచి క్షణాల్లో తీసుకునే అవకాశాన్ని కల్పించే దిశగా దక్షిణ మధ్య రైల్వే యాప్‌ను రూపొందించింది. ఈ యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ సేవలు ఈ నెల 15వ తేదీ అర్థరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
 
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు లేని సాధారణ ప్రయాణికుల కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో ద.మ.రైల్వే ముందుందన్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని సేవలకు డిజిటల్‌ పేమెంట్‌ మోడ్‌లో చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. 
 
దక్షిణ మధ్య రైల్వేలోని పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ యాప్‌ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొనే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్లాట్‌ఫాం టికెట్లను కూడా యూటీఎస్‌ యాప్‌ద్వారా బుక్‌ చేసుకోవచ్చని వినోద్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments