Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బహిరంగ ప్రదేశాల్లో కూడా వైఫై సేవలు.. చర్చల్లో గూగుల్

ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేవలను మరింతగా విస్తరించాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగా, బహిరంగ ప్రదేశాలు అంటే మాల్స్, విశ్వవిద్

బహిరంగ ప్రదేశాల్లో కూడా వైఫై సేవలు.. చర్చల్లో గూగుల్
, గురువారం, 5 జులై 2018 (12:10 IST)
ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేవలను మరింతగా విస్తరించాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగా, బహిరంగ ప్రదేశాలు అంటే మాల్స్, విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలల్లో కూడా వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ యత్నిస్తోంది. ఇందులోభాగంగా, వైఫై సర్వీసులు అందించే దిశగా టెలికాం ఆపరేటర్లు సహా ఇతరత్రా సంస్థలతో గూగుల్ చర్చలు జరుపుతోంది. 
 
ప్రస్తుతం దేశంలో ఎంపిక స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ స్పూర్తితో ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో కూడా గూగుల్‌ స్టేషన్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు ఆ సంస్థ భారత విభాగం డైరెక్టర్‌ కె. సూరి. రైల్‌ టెల్‌ భాగస్వామ్యంతో ప్రారంభించిన వైఫై సేవలతో యూజర్లు సగటున 300 ఎంబీ మేర డేటాను వినియోగించుకుంటున్నారని వివరించారు.
 
వైజాగ్, విజయవాడ, అలహాబాద్, గోరఖ్‌పూర్‌ మొదలైన స్టేషనన్లల్లో అత్యధికంగా డేటా వినియోగం ఉంటోందన్నారు. రిలయన్స్‌ జియో సర్వీసులు ప్రారంభమైనప్పటికీ డేటా వినియోగం గణనీయంగానే పెరిగిందన్నారు. వాస్తవానికి పబ్లిక్‌ వైఫై సర్వీసుల వల్ల టెల్కోలపై డేటా ట్రాఫిక్‌ భారం తగ్గుతుందన్నారు. పబ్లిక్ వైఫైతో 2019 నాటికి 4 కోట్ల మంది పైగా కొత్త యూజర్లు.. ఇంటర్నెట్‌కు చేరువ కాగలరని ఆయన అంచనా వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై జియో గిగా ఫైబర్‌ సేవలు.. ముకేశ్ అంబానీ