Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాడు నారదుడు ఉంటే.. నేడు గూగుల్ ఉంది : సీఎం విజయ్ రూపాణీ

భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం వల్ల మీడియాలో బాగా నానుతున్నారు. మొన్నటికిమొన్న త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ ఇష్టానుసారంగా మాట్లాడారు.

Advertiesment
నాడు నారదుడు ఉంటే.. నేడు గూగుల్ ఉంది : సీఎం విజయ్ రూపాణీ
, సోమవారం, 30 ఏప్రియల్ 2018 (14:00 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం వల్ల మీడియాలో బాగా నానుతున్నారు. మొన్నటికిమొన్న త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ ఇష్టానుసారంగా మాట్లాడారు. ముఖ్యంగా, యానా హెడెన్ తెల్లగా లేకపోయినా ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం ఎలా ఇచ్చారని, ఉద్యోగాన్వేషణ కోసం సమయం వృథా చేసుకోకుండా ఆవులు, పందుల పెంపకం ద్వారా ఉపాధి పొందాలని, పాన్ షాపులు పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈయన గారిని తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ అధినాయకత్వం ఆదేశాలు జారీచేసింది.
 
మరోవైపు, తాజాగా త్రిపుర సీఎం బిప్లబ్‌దేబ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరువకముందే, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నారద జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, పౌరాణిక కథల్లోని నారదునితో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను పోల్చారు. నారదుని దగ్గర ప్రపంచంలోని అన్ని విషయాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అదేవిధమైన పనిని గూగుల్ సెర్చ్ ఇంజిన్ చేస్తుందన్నారు. 
 
నిజానికి ఇటీవలి కాలంలో చాలా మంది బీజేపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. బీజేపీ చీఫ్ అమిత్ షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా త్రిపుర ముఖ్యమంత్రి హోదాలో దేవ్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ఎన్నికల్లో పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పలువురు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త కళ్లముందే భార్యను గొంతునులిమి హత్య చేసిన మరిది...