2019 క్రికెట్ ప్రపంచ కప్ : భారత్ తొలి మ్యాచ్ ఎవరితో తెలుసా?

వచ్చే (2019)లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగనుంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్‌తో తలపడనుంది. నిజానికి ఈ మ్యాచ్ 2019 జూన్ రెండో తేదీన జరగ

మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (19:47 IST)
వచ్చే (2019)లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగనుంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్‌తో తలపడనుంది. నిజానికి ఈ మ్యాచ్ 2019 జూన్ రెండో తేదీన జరగాల్సి దానిని జూన్ 4వ తేదీకి మార్చారు.
 
దీనికి కారణం లేకపోలేదు. లోథా కమిటీ సిఫారసుల మేరకు ఐపీఎల్ ఫైనల్‌కు, అంతర్జాతీయ మ్యాచ్‌కు మధ్య కనీసం 15 రోజుల సమయం ఖచ్చితంగా ఉండాలి. దీంతో ఐసీసీ సీఈవోల మీటింగ్‌లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 
 
2019 వరల్డ్‌కప్ మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లండ్‌లో జరగనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 వరకు జరగనుంది. దీంతో 15 రోజుల నిబంధన మేరకు జూన్ 4నే తొలి మ్యాచ్ ఆడే వీలుంది అని బీసీసీఐ అధికారి చెప్పారు. సౌతాఫ్రికాతో ఇండియా తొలి మ్యాచ్ ఉంటుందనీ, ఈ మార్పునకు సీఈసీ కూడా అంగీకరించిందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భారతీయుల గుండెల్లో బాధను నింపాను.. సాయం చేయండి: పాక్ హాకీ స్టార్ మన్సూర్