Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో లోపం - యూజర్లకు హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (09:11 IST)
మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో లోపం తలెత్తింది. దీంతో విండోస్ వినియోగదారులందరూ వెంటనే తమ కంప్యూటర్లను అప్‌డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ విజ్ఞప్తి చేసింది. లేనిపక్షంలో ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు చెలరేగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 
 
ఈ హ్యాకర్ల బారినపడకుండా ఉండాలంటే వెంటనే అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. విండోస్‌లోని ‘ప్రింట్ స్పూలర్’లో భద్రతా పరమైన లోపాలు ఉన్న విషయాన్ని తాము గుర్తించామని గతేడాది మేలో ‘సాంగ్‌ఫర్’ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకటించింది. 
 
ప్రింట్ స్పూలర్ అనేది ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. ప్రింట్ స్పూలర్‌లో లోపాలను గుర్తించిన సాంగ్‌ఫర్.. దానిని ఎలా హ్యాక్ చేయొచ్చన్న వివరాలను పొరపాటున ఆన్‌లైన్‌లో పెట్టేసింది. ఆ వెంటనే పొరపాటును గుర్తించి డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది చాలామందికి చేరిపోయింది.
 
‘ప్రింట్ నైట్‌మేర్’గా పిలుస్తున్న ఈ లోపాన్ని హ్యాకర్లు ఉపయోగించుకుని ఇతరుల కంప్యూటర్లలోని డేటాను చూడడం, డిలీట్ చేయడం, కొత్త యూజర్ అకౌంట్లను సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. విండోస్ 10, విండోస్ 7లోనూ ఈ లోపం ఉందని పేర్కొన్న మైక్రోసాఫ్ట్ వీటికోసం అప్‌డేట్‌లను విడుదల చేసింది.
 
వాస్తవానికి విండోస్ 7 అప్‌డేట్స్‌ను ఆపేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. అయితే, తాజా లోపం నేపథ్యంలో దానికి కూడా అప్‌డేట్‌ను విడుదల చేసింది. యూజర్లు అందరూ తప్పకుండా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల ముప్పు లేకుండా చూసుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments