ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్‌ను పట్టించిన వాళ్లకు 22 కోట్ల రూపాయలను బహుమతి ఇస్తామని కొలంబియా పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది.
అయితే, మార్క జుకర్‌బర్గ్‌ను పట్టించడం ఏంటని, అనుకుంటున్నారా.? అవును మీరు విన్నది నిజమే కానీ, జుకర్ బర్గ్‌ను కాదు అతడిలా పోలి ఉన్న మరో వ్యక్తిని పట్టిచ్చారు. ఈ ప్రకటన కొలంబియా పోలీసులు ఫేస్‌బుక్‌లోనే చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది.
కొద్ది రోజుల క్రితం కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు దుండగులు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు.