Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ సంస్థకు మహిమా కౌల్ రాజీనామా.. కారణం రైతు ఉద్యమమా?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:23 IST)
Mahima
సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థకు ఇండియాలో పాల‌సీ విభాగం అధినేతగా ఉన్న మ‌హిమా కౌల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. భార‌త్‌తోపాటు ద‌క్షిణాసియా వ్య‌వ‌హారాల పాల‌సీ విభాగం అధిప‌తిగానూ కొనసాగిన మహిమ తన రాజీనామా విషయాన్ని శనివారం ధృవీకరించారు. కాగా, మార్చి చివర్లోగా ఆమె తన పదవి నుంచి పూర్తిగా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటారు.
 
అలాగే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తోన్న ఉద్యమంపై ట్విటర్‌లో చర్చ కొనసాగుతుండటం, దేశానిని హాని చేసేలా విదేశీ శక్తులు కుట్రపన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఇటీవ‌ల రైతుల ఆందోళ‌న‌పై కొన్ని హ్యాండిల్స్ కుట్రను ప్రేరేపిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ భార‌త ప్ర‌భుత్వం ఫిర్యాదు చేయడం తెలిసిందే. 
 
గడిచిన మూడు వారాలుగా ట్విటర్ వేదికగా రైతు ఉద్యమం ఉధృతమవుతుండటం, అదే సమయంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతోన్న సందర్భంలోనే మహిమా గిల్ వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
 
మహిమ రాజీనామాకు, రైతుల ఉద్యమంపై వివాదానికి సంబంధం లేదని ట్విట్ట‌ర్ వ‌ర్గాలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే మ‌హిమా కౌల్ త‌న ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని ట్విట్ట‌ర్ ప‌బ్లిక్ పాల‌సీ ఉపాధ్య‌క్షుడు మొనిక్యూ మెచె ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆమె రాజీనామా త‌మ సంస్థ‌కు న‌ష్ట‌మేన‌ని పేర్కొన్నారు. ఐదేండ్ల‌కు పైగా సంస్థ పురోగ‌తిలో ఆమె ముఖ్య‌మైన పాత్ర పోషించార‌న్నారని, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని మెచె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments