ఎయిర్‌టెల్ 'దీపావళి' : రూ.2500కే 4జీ స్మార్ట్‌ఫోన్?

ఎయిర్‌టెల్ 'దీపావళి' : రూ.2500కే 4జీ స్మార్ట్‌ఫోన్?

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (06:45 IST)
ఎయిర్‌టెల్ తాను త‌యారు చేయ‌నున్న 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత చౌక‌గా కేవ‌లం రూ.2500ల‌కే అందించ‌నున్న‌ట్టు తెలిసింది. కాగా ఇప్ప‌టికే ఈ ఫోన్ త‌యారీ కోసం ప‌లు మొబైల్ త‌యారీ కంపెనీల‌తో ఎయిర్‌టెల్ చ‌ర్చలు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. 
 
డిస్‌ప్లే, కెమెరా, బ్యాట‌రీ వంటి మూడు అంశాల్లో యూజ‌ర్‌కు అన్ని విధాలుగా నచ్చేవిధంగా కాన్ఫిగ‌రేష‌న్ ఉండేలా ఫోన్‌ను తేవాల‌ని ఎయిర్‌టెల్ భావిస్తున్న‌ట్టు సమాచారం. ఇందులో భాగంగానే లావా, కార్బ‌న్ వంటి సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. 
 
అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే సెప్టెంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు లేదా అక్టోబ‌ర్ మొద‌టి వారంలో ఎయిర్‌టెల్ త‌న బ‌డ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తున్న‌ది. అయితే, ఈ వార్తలపై ఎయిర్‌టెల్ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికార‌క స‌మాచారం వెల్ల‌డించ‌లేదు. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్‌ ఫోన్‌ను అందజేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, ఐడియా త‌న కంపెనీ ద్వారా చాలా త‌క్కువ ధ‌ర‌కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామ‌ని వెల్లడించింది. ఇదే కోవ‌లో ప్ర‌స్తుతం ఎయిర్‌టెల్ కూడా చౌక ధ‌ర‌కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించ‌నున్న‌ట్టు ప్రకటించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

Raj Tarun: ఈసారి చిరంజీవి ని నమ్ముకున్న రాజ్ తరుణ్

Jana Nayagan: కరూర్ ఘటన: విజయ్ జన నాయగన్ పాట విడుదల వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments