Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సవతితల్లి బుద్ధేంటో చూపెట్టింది.. శిశువు మర్మాంగాన్ని కోసేసింది...

సవతి తల్లి బుద్ధేంటో చూపెట్టింది ఓ కిరాతకురాలు. రెండో పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఆ పెళ్లిని సవతి శిశువుపై చూపెట్టింది. తల్లిలేని బిడ్డ అనే కనికరం లేకుండా ఆ బిడ్డ మర్మాంగాన్ని కోసి పారేసింది. దీంతో రెండ

Advertiesment
సవతితల్లి బుద్ధేంటో చూపెట్టింది.. శిశువు మర్మాంగాన్ని కోసేసింది...
, ఆదివారం, 13 ఆగస్టు 2017 (17:09 IST)
సవతి తల్లి బుద్ధేంటో చూపెట్టింది ఓ కిరాతకురాలు. రెండో పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఆ పెళ్లిని సవతి శిశువుపై చూపెట్టింది. తల్లిలేని బిడ్డ అనే కనికరం లేకుండా ఆ బిడ్డ మర్మాంగాన్ని కోసి పారేసింది. దీంతో రెండు నెలల వయస్సున్న ఆ బాలుడు కన్నుమూశాడు. ఈ ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నైజీరియా రాజ‌ధాని అబుజా శివార్ల‌లోని వాడ ప్రాంతానికి చెందిన దౌడా అని వ్య‌క్తి మొద‌టి భార్య మ‌ర‌ణించ‌డంతో బ‌రౌతు (17)ను అత‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. శిశువు పేరు దౌడా బుహారి. ఈ బిడ్డను ప్ర‌స‌వించిన వెంట‌నే.. మొద‌టి భార్య మ‌ర‌ణించింది. 
 
రెండో పెళ్ళి ఇష్టం లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమ‌యంలో ఆమె బుహారి అంగాన్ని కోసి పారేసింది. దీనితో ఆ బాబును ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స‌తో పాటు అంగాన్ని మ‌ళ్లీ అతికించ‌డానికి యుకేకు త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు మూడుసార్లు ఆప‌రేష‌న్ చేశారు. అయిన‌ప్ప‌టికీ సున్నితమైన నరాలు తెగడంతో డాక్టర్లు మూడుసార్లు శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ చిన్నారి కన్నుమూశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్ టెల్ రోమింగ్ బిల్లు రూ.1.86లక్షలొచ్చింది- ఇంతెలా వచ్చింది.. కస్టమర్ షాక్!