Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ ​స్మార్ట్​ఫోన్ ఫీచర్స్ ఏంటంటే..?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (23:25 IST)
Sony Xperia 1 III
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ సోనీ నుంచి సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ ​స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. ప్రస్తుతం జపాన్‌లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌.. ఎన్నో విభిన్న ఫీచర్లతో పాటు ఆకట్టుకునే డిస్​ప్లేతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. 
 
5జీ సపోర్ట్​తో వస్తున్న ఈ డివైజ్‌లో.. స్నాప్‌డ్రాగన్ 690 ఎస్​ఓసీ ప్రాసెసర్, 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, ఓఎల్​ఈడీ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
 
సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ ధర
సోనీ ఎక్స్​పీరియా 10 III లైట్ సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 6 జీబీ/64 జీబీ వేరియంట్ జపాన్​లో JPY 46,800 (సుమారు రూ. 31,650) వద్ద లభిస్తుంది. 
 
ఇది​ జపాన్​లోని Rakuten Mobile, IIJmio, Mineo, goo, nuro ఆన్​లైన్ ప్లాట్​ఫామ్​లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్​, బ్లూ, వైట్​, పింక్​ అనే నాలుగు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.
 
స్పెసిఫికేషన్లు
సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ స్నాప్‌డ్రాగన్ 690 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది 6 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను విస్తరించుకోవచ్చు. 
 
ఈ స్మార్ట్​ఫోన్​ 6.0 -అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్​పై పనిచేస్తుంది. దీనిలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌ను కూడా అందించింది.
 
ఎక్స్​పీరియా 10 III లైట్​లో 12 మెగాపిక్సెల్​ మెయిన్​ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో యూనిట్‌ కెమెరాలతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది. 
 
దీని ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కొరకు ప్రత్యేకంగా 8 MP కెమెరాను చేర్చింది. ఈ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 4,500 mAh బ్యాటరీతో వస్తుంది. 
 
5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్, యూఎస్​డీ టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను సంస్థ ఇందులో చేర్చింది. ప్రస్తుతానికి జపాన్​లో మాత్రమే విడుదలైన ఈ ఫోన్​ గ్లోబల్​ మార్కెట్​లోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై సోనీ ఎటువంటి స్పష్టతనివ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments