Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ లవర్స్‌కి తీపి కబురు.. ఆ చర్చలు సఫలమైతే.. ఇంకేముంది?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:20 IST)
చైనాతో సరిహద్దుల ఉద్రిక్తత నేపథ్యంలో.. టిక్ టాక్‌తో పాటు చైనా యాప్‌లపై నిషేధం విధించింది భారత సర్కారు. దీంతో టిక్ టాక్ యూజర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్న సమయంలో టిక్ టాక్ లవర్స్‌కి తీపికబురు అందింది. టిక్ టాక్ మళ్లీ భారత్‌లో అందుబాటులోకి రావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
 
ఎలాగంటే? టిక్ టాక్ చైనా కంపెనీ కావడంతో ఇండియన్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. ప్రస్తుతం టిక్ టాక్‌ను జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా వుంది. టిక్ టాక్‌ను కొనుగోలు చేయడానికి సాఫ్ట్ బ్యాంక్ ప్రస్తుతం భారతీయ భాగస్వామి కోసం తీవ్రంగా వెతుకులాటను ప్రారంభించిందని విశ్వాసనీయ వర్గాల సమాచారం.
 
ఇప్పటికే సాఫ్ట్ బ్యాంక్ టిక్ టాక్ కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి కంపెనీలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే టిక్ టాక్ యూజర్లు మళ్లీ టిక్ టాక్‌లో వీడియోలు చేసుకునే ఛాన్స్ రావొచ్చు. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్ టిక్ టాక్ యాప్ నిషేధంతో భారీగా నష్టపోయింది. దాదాపు 6 బిలియన్ డాలర్లు నష్టపోయి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments