Webdunia - Bharat's app for daily news and videos

Install App

RIP LG: స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌కు గుడ్ బై..

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (19:46 IST)
LG
స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌కు గుడ్ బై చెబుతున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఎల్‌జీ ప్రకటించింది. జూలై నెల చివరి నాటికి స్మార్ట్‌ఫోన్ బిజినెస్ నుంచి తప్పుకుంటామని వెల్లడించింది. ఒక దిగ్గజ కంపెనీ ఇలా స్మార్ట్‌ఫోన్ వ్యాపారం నుంచి తప్పుకుంటుండటం ఇదే ప్రథమం. నష్టాల కారణంగానే స్మార్ట్‌ఫోన్ బిజినెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎల్‌జీ తెలిపింది. 
 
ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ వ్యాపారం నుంచి వైదొలగడం వల్ల యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలకు ప్రయోజనం కలుగనుంది. ఎల్‌జీ మార్కెట్ వాటాను ఈ కంపెనీలు ఆక్రమించే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎల్‌జీ కంపెనీ ఆరేళ్లుగా నష్టాలతోనే నడుస్తోంది. దాదాపు రూ.33 వేల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో కంపెనీ ఈ విభాగం నుంచి తప్పుకుంటోంది. ఎల్‌జీ ఐదు వ్యాపార విభాగాల్లో స్మార్ట్‌ఫోన్ డివిజన్ చాలా చిన్నది. 
 
కంపెనీ ఆదాయంలో 7 శాతం వాటా మాత్రమే ఆక్రమించి ఉంది. ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ వ్యాపారం నుంచి తప్పుకుంటుండటం వల్ల ఇప్పటికే కంపెనీ స్మార్ట్‌ఫోన్ కొన్న వారిలో ఆందోళనలు మొదలయ్యి ఉండొచ్చు. అయితే కంపెనీ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ కొన్న వారికి తీపికబురు అందించింది. సర్వీస్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తామని స్పష్టతనిచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments