రెండు దేశాల నడుమ సంఘీభావం, మానవతా మద్దతు యొక్క అసాధారణ చిహ్నంగా, కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి సహాయంగా ఉచితంగా పంపిణీ చేసేందుకు ఒక లక్ష హెల్త్ మాస్క్‌లను విరాళంగా దక్షిణ కొరియాలోని సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ అంగుక్ జెన్ సెంటర్ అందించింది. ఈ విరాళానికి కొరియాలోని కె- ఆర్ట్ ఇంటర్నేషనల్ ఎక్సేంజ్ అసోసియేషన్, భారతదేశంలోని ఇన్‌కో కేంద్రాలు సమన్వయం చేశాయి.
ఈ సరుకును (దాదాపు 150 మిలియన్ కొరియన్ వోన్) నేడు టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ శ్రీ వేణు శ్రీనివాసన్, శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ; చైర్మన్, ఇన్‌కో సెంటర్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా యొక్క సంస్కృతి, డిప్లొమసీ కోసం గుడ్విల్ ఎన్వాయ్‌లు టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన సామాజిక సేవా విభాగం శ్రీనివాస్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా ఉచిత పంపిణీ కోసం అందజేశారు.
ఈ సందర్భంగా వేణు శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ఇన్‌కో కేంద్రం దయార్ద్ర హృదయంతో ఒక లక్ష మాస్కులను విరాళంగా అందించినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాస్కులను ధరించడం, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించి అత్యంత కఠినమైన నిబంధనలను ఆచరించడం, భౌతిక దూరం పాటించడం అనేవి నూతన సాధారణతగా వెలుగొందుతున్న ఈ సంక్షోభ కాలంలో సమయానికి, అత్యంత విలువైన విరాళాన్ని అందించడాన్ని స్వాగతిస్తున్నాము.
దేశవ్యాప్తంగా స్థానిక సమాజాలకు టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన సామాజిక సేవా విభాగం శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా ఈ మాస్కులను పంపిణీ చేయనున్నామని భరోసా అందిస్తున్నాం. బుసాన్ నుంచి చెన్నైకు ఈ సద్భావన మరియు మద్దతు యొక్క వినూత్నమైన పౌర సంజ్ఞ, రెండు దేశాల నడుమ విలువైన బంధాన్ని సూచిస్తుంది’’ అని అన్నారు.
మిస్టర్ యంగ్-సీప్ క్వాన్, చెన్నైలోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ మాట్లాడుతూ ‘‘మానవ సమాజం ఎదుర్కొన్న అతిపెద్ద, అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా ఈ మహమ్మారి నిలుస్తుంది. మనం బలంగా ఉండటంతో పాటుగా కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించగలం. పౌర సమాజ స్ధాయిలో ఈ సహకారం స్పష్టంగా సామాన్య కొరియన్లు మరియు భారతీయులు ఒకరికొకరు ఎంతగా సహకరించుకోగలరో చూపుతుంది. మనం అంతా కలిసికట్టుగా ఉంటే ఈ సవాళ్లను మనం అధిగమించగలం’’ అని అన్నారు.
ఈ అత్యున్నత నాణ్యత కలిగిన మాస్కులను బ్లూఇండస్ కంపెనీ లిమిటెడ్ ఉత్పత్తి చేయగా భారతదేశంలో పంపిణీ కోసం ప్రత్యేకంగా CEO జియోంగ్ చెయోన్-సిక్ అందించారు. ఈ మాస్కులను భారతదేశానికి రవాణా చేయడానికి కొరియాలోని యున్సాన్ షిప్పింగ్ ఎయిర్ యొక్క CEO మిస్టర్ యాంగ్ జే-సాంగ్ సహకరించారు.