భారత్‌లో రియల్‌మి యు1 మోడల్ విడుదలైంది. మొబైల్ తయారీదారు ఒప్పో సంస్థకు చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని భారత మార్కెట్‌లోకి ఇవాళ విడుదల చేసింది. ఈ ఫోన్‌ని రియల్‌మి యు1 స్మార్ట్‌ఫోన్ పేరుతో రిలీజ్ చేసింది. ఈ మోడల్‌లో 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. దీని ధర రూ.10,999గా నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీ నుండి ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.