Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేస్తే పిల్లలకు ఎక్స్‌ట్రా మార్కులు... ఎక్కడ?

karnataka
Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:30 IST)
ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు.. ఓటు వేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తోంది. వేసవి సెలవులు రావడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పర్యటనలకు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ వేసవిలో ఎన్నికలు ఉండటంతో ప్రజలు ఓటు వేయడం కంటే పర్యటనకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే అవకాశం ఉంది.


అయితే ఓటు వేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించేందుకు కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకునే ఉద్దేశంతో ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాయి.
 
ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేస్తే, పిల్లలకు అదనపు మార్కులు వేస్తామంటూ ఆఫర్ చేస్తున్నాయి. ఈ రకంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఓటు వేసేలా ప్రొత్సాహిస్తున్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులను ఓటు వేసేలా చూడాలి. ఒక్కో పేరంట్ ఓటుకు ఒక్కో అదనపు మార్కు వేస్తారు.

ఇప్పటికే దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు SMSలు పంపిస్తున్నారు. ఓటు వేసాక తల్లిదండ్రులు తప్పనిసరిగా పాఠశాలకు వచ్చి వేలిపై సిరాను చూపించాల్సిందిగా సూచిస్తున్నారు.

ఒకవేళ ఆరోజు కుదరకుంటే పక్కరోజు వచ్చి అయినా వేలిపై సిరా గుర్తును చూపించాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థులకు అదనపు మార్కులు వేస్తామని కండీషన్ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments