Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IF YOUR BAD, I AM YOUR DAD.. ధోనీ వీడియో వైరల్..(Video)

Advertiesment
IF YOUR BAD, I AM YOUR DAD.. ధోనీ వీడియో వైరల్..(Video)
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:15 IST)
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకు కారణం ఆ జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వుండటమే. ప్రస్తుతం ధోనీ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ధోనీ వ్యూహాలు, ఆటతీరుకు సంబంధించి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
తాజాగా ఐపీఎల్ 12వ సీజన్‌లో భాగంగా చేపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 46 బంతులకు ధోనీ 75 పరుగులు సాధించాడు. ఇంకా చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్‌ను కొట్టిన ధోనీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ మూడో తేదీ (బుధవారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో కృనాల్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాహూర్ విసిరిన బంతుల్ని కృణాల్ పాండ్యా పరుగులు సాధించాడు. అలాగే ధోనీ విసిరిన బంతిని కూడా కృనాల్ పాండ్యా స్కోర్ చేయాలనుకున్నాడు. అయితే ఆ సమయంలో ధోనీ కృనాల్‌ను అవుట్ చేసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
అలాగే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా కృనాల్ పాండ్యా విసిరిన 14వ ఓవర్‌కు జాదవ్, ధోనీ బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో బంతి విసిరిన పాండ్యా ధోనీ పరుగులు తీసేందుకు క్రీజుకు బయటకు వెళ్లాడనుకుని మన్కడ్ పద్ధతిలో అవుట్ చేసేందుకు ప్రయత్నించాడు. 
webdunia
 
కానీ ధోనీ క్రీజు దాటినా ఆయన బ్యాట్ మాత్రం క్రీజుకు లోపలే వుండటంతో పాండ్యా ప్రయత్నం విఫలమైంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. IF YOUR BAD,I AM YOUR DAD పేరిట ఈ వీడియోను షేర్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.చూడండి వీడియో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై ఓడినా ధోనీకి క్రేజ్ తగ్గలేదు.. ధోనీ ముందు హెలికాప్టర్ షాట్