Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీకి అలా ఎర్త్ పెట్టిన ధోనీ..?

Advertiesment
ఢిల్లీకి అలా ఎర్త్ పెట్టిన ధోనీ..?
, బుధవారం, 27 మార్చి 2019 (15:04 IST)
చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీకి మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపును నమోదు చేసుకుంది. ఈ విజయానికి కారణం ఢిల్లీ కేపిటల్స్ జట్టును 150 పరుగులకే కట్టడి చేయడానికి కారణం రిషబ్ పంత్‌ను అవుట్ చేయడమే. కెప్టెన్ ధోనీ, బ్రావో పక్కా ప్లాన్ ప్రకారం రిషబ్ పంత్‌ను అవుట్ చేశారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. 
 
దీంతో ముంబైపై ఢిల్లీ గెలుపును నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్ ధీటుగా వుంటుందని అందరూ ఆశించారు. ఈ అంచనాలకు ధీటుగానే 13 బంతులకు రిషబ్ పంత్ 25 పరుగులు సాధించాడు. ఇదే తరహాలో రిషబ్ జోరు కొనసాగితే తమ జట్టుకు విజయం గల్లంతేనని గ్రహించిన ధోనీ.. మాస్టర్ ప్లాన్ వేశాడు. 
 
రిషబ్ పంత్ లెగ్ సైడ్ ఫైన్ లైన్ సైడ్ భారీ షాట్లు కొట్టాడు. ఆ ఓవర్‌ను బ్రావోకు ఇచ్చాడు. ఇంకా తొలి బంతిని రిషబ్ పంత్‌కు వైడ్‌గా విసిరమన్నాడు. తదుపరి బంతిని కూడా లెగ్ సైడ్ వైపు విసరమని సలహా ఇచ్చాడు. ఇంకా తాహూర్‌ను కూడా ఫీల్డింగ్ పాయింట్‌లో పక్కాగా నిలబెట్టాడు.. ధోనీ. అలాగే బ్రావో 16వ ఓవర్లో తొలి రెండు బంతులను వైడ్‌గా లెఫ్ట్ స్టంప్ వైపు విసిరాడు. 
 
ఈ ప్లాన్ తెలుసుకోలేని రిషబ్ పంత్ బ్రావో బంతిని సిక్సుగా మలిచేందుకు ప్రయత్నించాడు. ఆ బాల్ సిక్సర్‌కు వెళ్లకుండా తాహూర్ చేతికి క్యాచ్‌గా వెళ్లడంతో.. సీన్ రివర్స్ అయ్యింది. దీంతో భారీ స్కోర్ చేయాల్సిన రిషబ్ పంత్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ దారి పట్టాడు. అయితే రిషబ్ పంత్ మాత్రం ఇంకా కొద్దిసేపు క్రీజులో కొనసాగివుంటే.. చెన్నై జట్టు విజయం కష్టతరమయ్యేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''మన్కడ్‌''కు మద్దతు.. క్రీజ్ దాటితే అవుట్ చేయొచ్చు.. హెచ్చరించనక్కర్లేదు..