రెడ్‌మీ నోట్ 9 ప్రో ఫోన్ కొంటున్నారా?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:04 IST)
ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ షియోమీ ఇటీవల రెడ్‌మీ సిరీస్‌లో నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసిన సంగతి విదితమే. జూన్ 2వ తేదీ అనగా ఈరోజు మధ్యాహ్నం నుండి మరోసారి ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఊహించిన స్థాయి కంటే ఎక్కువ విక్రయించబడ్డాయి. వినియోగదారుల నుంచి వచ్చిన అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని, షియోమీ సంస్థ మరొకసారి ఫ్లాష్ సేల్ నిర్వహించాలని నిర్ణయించింది.
 
ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు అయిన అమెజాన్ ఇండియా, ఎంఐ డాట్‌కామ్ ద్వారా ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. మూడు రంగులలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. రెడ్‌మీ నోట్ 9 ప్రో ఫోన్ 4GB + 64GB,  6GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. అయితే 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.13,999 కాగా 6జీబీ వేరియంట్‌ ధర రూ.16,999గా నిర్ణయించారు.
 
రెడ్‌మీ 9 ప్రో ఫోన్ స్పెసిఫికేషన్‌లు:
* డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
* ప్రాసెసర్‌: స్నాప్‌డ్రాగన్‌ 720జీ
* ఫ్రంట్‌ కెమెరా: 19 మెగాపిక్సెల్‌
* రియర్‌ కెమెరా: 48MP + 8MP + 5MP + 2MP
* ర్యామ్‌: 4జీబీ
* ఇంటర్నెల్ స్టోరేజ్‌: 64జీబీ
* బ్యాటరీ కెపాసిటీ: 5020mAh
* ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్‌పై పూనమ్ ఫైర్

క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ .. ఇండస్ట్రీ అద్దం లాంటిది

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments