Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా మహమ్మారి.. ఆరుగురు మృతి.. డీజీపీ ఆఫీసులో కూడా?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:01 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తెలంగామలో సోమవారం ఆరుగురు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌-19 బారిన పడి ప్రాణాలొదిలిన వారి సంఖ్య 88కు చేరింది. సడలింపుల తర్వాత జీహెచ్‌ఎంసీ బయట జిల్లాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. 
 
తాజాగా జీహెచ్‌ఎంసీలో 79 కేసులు రాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు 434 మందిలో పాజిటివ్‌ అని తేలింది. రాష్ట్రంలో 2358 మందితో మొత్తం 2792కు పాజిటివ్‌ కేసులు చేరాయి. వీరిలో 1491 మంది కోలుకుని డిశ్చార్జి కాగా మిగిలిన 1213 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
రాష్ట్ర పోలీసు శాఖ హెడ్‌క్వార్టర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. లక్డీకాఫూల్‌లోని డీజీపీ కార్యాలయంలోని పరిపాలనా విభాగంలో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కార్యాలయ వర్గాలను బట్టి తెలిసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments