Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడే అమ్మాయిలు జాగ్రత్త.. బట్టలు విప్పమంటూ..?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (14:57 IST)
సోషల్ మీడియాలో మీరు గేమ్స్ ఆడుతున్నారా? అదీ అమ్మాయిలై చాలా అప్రమత్తంగా వుండాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడేటప్పుడు అమ్మాయిలూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసే అవకాశముంది. తాజాగా ఈ గేమ్ ద్వారా ఓ అమ్మాయి ఇబ్బందుల్లో చిక్కుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ 13 సంవత్సరాల బాలుడు.. తన స్కూల్‌మేట్ అయిన ఓ విద్యార్థిని(14)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రెక్వెస్ట్ పంపాడు. అయితే గుర్తు తెలియని ఫోటో, ప్రొఫైల్‌తో ఆ విద్యార్థినికి రెక్వెస్ట్ పంపగా ఆమె అంగీకరించింది. కొద్ది రోజులకు వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడటం మొదలు పెట్టారు. 
 
ఒకరోజు గేమ్‌లో భాగంగా డేర్ చేయాలని ఆ అమ్మాయికి అబ్బాయి సందేశం పంపాడు. దుస్తులు విప్పాలని ఆదేశించడంతో గేమ్ పరంగా ఆమె దుస్తులు విప్పేసింది. ఇదంతా లైవ్‌లోనే జరుగుతుంది. దీంతో అతను ఆమెకు తెలియకుండా తన ఫోన్‌లో రికార్డు చేశాడు. 
 
మళ్లీ మళ్లీ బట్టలు విప్పాలని విద్యార్థినికి ఆ యువకుడు గేమ్ ఛాలెంజ్ చేశాడు. దుస్తులు విప్పకపోతే వీడియోలు వైరల్ చేస్తానని ఆమెను బెదిరించాడు. మొదటిసారి దుస్తులు విప్పిన వీడియోను ఆమెకు పంపి బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు గుర్తించారు. తన స్కూల్‌మేట్ అని తెలియడంతో విద్యార్థిని షాక్‌కు గురైంది. ఆ యువకుడి తల్లిదండ్రులు కూడా ఖంగుతిన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

హీరో సూర్య 45 సినిమా ఆనైమలైలో గ్రాండ్ గా లాంచ్

మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments