మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై వాసులకు ఓ గుడ్‌న్యూస్ అందించింది. మహానగర ప్రజలకు జీవనాధారమైన లోకల్ రైళ్లలో ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కొవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలను ఫిబ్రవరి 28 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
గతేడాది మార్చిలో కరోనా కారణంగా ఆగిపోయిన ఈ లోకల్ రైళ్లను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. అయితే ఫిబ్రవరి ఒకటి నుంచి సాధారణ ప్రజలకు అనుమతించినా.. దానికి ప్రత్యేక సమయాలను కేటాయించారు. ఉదయం ఏడు గంటల లోపు, మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు, రాత్రి 9 గంటల తర్వాతే ప్రజలను ఈ రైళ్లలో అనుమతించనున్నారు.