Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జాక్ మా'కు చెక్ పెట్టిన అంబానీ... ఆసియాలోనే అపరకుబేరుడుగా ముఖేశ్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (13:23 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసియాలోనే అపరకుబేరుడుగా అవతరించారు. రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్‌తో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అతిపెద్ద డీల్ కుదుర్చుకోవడంతో ముకేశ్ సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితంగా ఆయన ఆసియాలోనే అతిపెద్ద కుబేరుడుగా అవతరించారు. 
 
అపరకుబేరుల జాబితాలో ఇప్పటివరకు చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మా మొదటి స్థానంలో ఉంటూ వచ్చారు. కానీ, తాజా డీల్‌తో జాక్ మాకు ముఖేశ్ అంబానీ చెక్ పెట్టారు. 
 
ఫేస్‌బుక్ - రిలయన్స్ జియోల మధ్య కుదిరిన డీల్ విలువ రూ.43,574 కోట్లు. అతిపెద్ద డీల్‌గా నిలిచిన రిలయన్స్‌ జియోలో 9.99 శాతం వాటాను ఫేస్‌బుక్‌ సొంతం చేసుకోనుంది. 
 
ఈ వార్తలు రిలయన్స్‌తోపాటు పలు రంగాల్లో జోష్ నింపింది. దీంతో బుధవారంనాటి మార్కెట్‌లో రిలయన్స్ షేరు 10 శాతానికి పైగా ఎగిసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. 
 
ఇప్పటికే అపర కుబేరుల జాబితాలో నిలిచిన అంబానీ తాజా పరిణామంతో చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments