Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్20 ప్రో లాంచ్: ధర రూ.36,999

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (15:25 IST)
Motorola Edge 20 Pro
భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎడ్జ్ 20 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది మోటోరోలా. ఇప్పటికే ఈ సిరీస్‌లో మోటోరోలా ఎడ్జ్ 20 , మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో మోడల్‌ను రిలీజ్ చేసింది.  
 
మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో ధర రూ.36,999. కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. అక్టోబర్ 3న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ సేల్ ప్రారంభం అవుతుంది.  
 
మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
 
ఫీచర్స్ 
మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.1 వర్షన్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిడ్‌నైట్ స్కై, ఇరిడీసెంట్ క్లౌడ్ కలర్స్‌లో కొనొచ్చు.
స్టాక్ ఆండ్రాయిడ్
 
మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 
ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. 
ఇందులో గూగుల్ యాప్స్ తప్ప బ్లోట్ వేర్ ఉండదు. 
మోటోరోలా యాప్స్ ఉంటాయి. 
రెండేళ్లు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్, రెండేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments