Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ప్లే స్టోర్‌లో నకిలీ యాప్.. అప్రమత్తంగా వుండండి.. శాంసంగ్

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (13:01 IST)
శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్ చేసేందుకు నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య ఒక కోటికి చేరింది. ఈ మేరకు వినియోగదారులు ఈ నకిలీ యాప్‌లో ఎలాంటి డేటాను షేర్ చేసుకోవద్దని శామ్‌సంగ్ విజ్ఞప్తి చేసింది. శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ అప్‌డేట్ చేసేందుకు కోటి మంది కస్టమర్లు ఓ నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వున్నారు. 
 
ఆండ్రాయిడ్ అప్‌డేట్ కోసం అందరూ గూగుల్ ప్లే స్టోర్‌ను ఉపయోగిస్తుంటారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా శామ్‌సంగ్‌ను అప్‌డేట్ చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కోటి మందికి పైగా నకిలీ యాప్‌ను డౌన్ లోడ్ చేసినట్లు తెలియవచ్చింది. ప్రకటనలు, యాప్ అప్ డేట్ చేసేందుకు చెల్లింపులు అంటూ ఈ నకిలీ యాప్‌ పలువురిని ఇబ్బందికి గురిచేసింది. 
 
అయితే ఐటీ నిపుణుడు ఒకరు గూగుల్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరరు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ నకిలీ యాప్‌ను తొలగించారు. అయితే శాంసంగ్ సంస్థకు ఏమాత్రం సంబంధం లేని అప్‌డేట్స్ ఫర్ శామ్‌సంగ్ అనే యాప్ వుంది. 
 
స్మార్ట్‌ఫోన్‌లో ఇలాంటి యాప్ వుంటే వెంటనే తొలగించండని సంస్థ వెల్లడించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శాంసంగ్ వినియోగదారులు అప్రమత్తమయ్యారు. ఇంకా శాంసంగ్ నుంచి విడుదలయ్యే అన్నీ యాప్‌లూ ఉచితంగానే వినియోగదారులకు అందిస్తుందని.. అందుచేత నకిలీ యాప్‌ల కోసం డబ్బులు చెల్లించకండని సంస్థ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments