Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ నెలలో కలెక్షన్లు కుమ్మేశారు.. శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్లు

Advertiesment
జూన్ నెలలో కలెక్షన్లు కుమ్మేశారు.. శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్లు
, సోమవారం, 8 జులై 2019 (11:03 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ నెలలో మాత్రం హుండీ వసూళ్లు భారీగా చేరాయి. జూన్ నెలలో మాత్రం వంద కోట్లకు పైగా శ్రీవారికి నగదు కానుకగా వచ్చి చేరింది.

జూన్ నెలలో మాత్రం ఈ ఏడాది భారీ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో కొండపైనున్న హోటళ్లు, కాటేజ్‌లు నిండిపోయాయి. 
 
రోడ్లపైనే చాలామంది శ్రీవారి దర్శనం కోసం వేచి వున్నారు. ప్రస్తుతం మోస్తరుగా భక్తులు కొండపై దర్శనానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం గత ఏడాది జూన్ కంటే భారీగా పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇంకా గత ఏడాది జూన్ నెలలో 95 లక్షల లడ్డూలను భక్తులకు అందజేస్తే.. ఈ ఏడాది జూన్ నెలలో ఒక కోటి 13 లక్షల లడ్డూలను భక్తులకు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి పనిమనిషిపై జర్నలిస్టు అత్యాచారం... ఎక్కడ?