Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత.. ఇకపై రోజువారీ పర్యవేక్షణ

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (12:14 IST)
టిక్‌టాక్‌ యాప్‌ డౌన్‌లోడింగ్‌పై ఉన్న నిషేధాన్ని మద్రాసు హైకోర్టు తొలగించింది. యాప్‌ను నిరంతరం మానిటర్ చేస్తామని టిక్‌టాక్ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. దీంతో సంతృప్తి చెందిన హైకోర్టు మద్రాస్ బెంచ్ నిషేధాన్ని ఎత్తివేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, టిక్‌టాక్ యాప్‌ను తొల‌గించాల‌ని సాఫ్ట్‌వేర్ సంస్థ‌లు గూగుల్, యాపిల్‌ల‌కు గ‌తంలో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ శాఖలు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే గూగుల్‌, యాపిల్‌లు త‌మ త‌మ యాప్ స్టోర్స్ నుంచి టిక్‌టాక్ యాప్‌ను తొల‌గించాయి. కాగా యాప్‌ను నిషేధించ‌డం వ‌ల్ల త‌మ సంస్థ‌కు రోజువారిగా పెద్ద ఎత్తున న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని చెబుతూ టిక్‌టాక్ డెవ‌ల‌ప‌ర్ బైట్‌డ్యాన్స్ టెక్నాల‌జీ మ‌ద్రాసు హైకర్టును ఆశ్రయించింది. 
 
ఒకవేళ ఈ యాప్‌లో అస‌భ్య‌క‌రంగా ఉన్న పోస్టుల‌ను ఇప్ప‌టికే తొల‌గించామ‌ని, ఇక‌పై యాప్‌ను నిరంత‌రం మానిట‌ర్ చేస్తుంటామని, ఎలాంటి అస‌భ్య‌క‌ర వీడియోలు పోస్టు కాకుండా చూస్తామని ఆ కంపెనీ కోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో మద్రాసు హై కోర్టులోని మ‌దురై బెంచ్ టిక్‌టాక్ యాప్ డౌన్‌లోడింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలో ఈ యాప్ ఇక గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్స్‌లో త్వ‌ర‌లో మ‌ళ్లీ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments