Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె వయసు పాతికేళ్లే.. ఆస్తుల సంగతేంటో తెలుసా? 25 బిలియన్‌ డాలర్లు..!

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (16:07 IST)
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకడు. ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో చాలాకాలం నుంచి ఉన్న బిల్ గేట్స్.. ఇటీవల 27ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. అయితే ఇదే రోజు బిల్ గేట్స్ పెట్టుబడి సంస్థ 1.8 బిలియన్ డాలర్ల (రూ.13 వేల కోట్లకుపైగా) విలువైన స్టాక్స్‌ను భార్య మెలిండాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇదే రోజు దంపతులిద్దరూ విడాకులు తీసుకోగా.. ఈ సమయంలోనే వారి పిల్లలు గురించి కూడా చర్చకు వచ్చింది.
 
బిల్ గేట్స్, మెలిండా గేట్స్ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె జెన్నిఫర్ కేథరీన్ గేట్స్(25) కాగా.. చిన్న కుమార్తె ఫోబ్ అడిలె గేట్స్(18), వీరిద్దరి మధ్యలో కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు రోరే జాన్ గేట్స్ వయస్సు 22ఏళ్లు. బిల్ గేట్స్ కుమార్తె జెన్నిఫర్ కేథరీన్ గేట్స్ ప్రస్తుతం ఆమె పొందివున్న ఆస్తి కారణంగా వార్తల్లో నిలిచింది. 
 
జెన్నీఫర్‌ గేట్స్‌ వయసు పాతికేళ్లే కాగా.. ఆమె పేరిట ఉన్న ఆస్తి మాత్రం 25 బిలియన్‌ డాలర్లట. అంటే మన భారతీయ కరెన్సీలో లక్షా 82 వేల కోట్ల రూపాయలు. ఇంత చిన్నవయసులో ఇంత పెద్ద మొత్తంలో నికర ఆస్తులు ఉన్న వ్యక్తి ఆమెనే. 
 
జెన్నీఫర్‌ సియాటెల్‌లోని లేక్‌సైడ్‌ హైస్కూల్లో చదువుకుని, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో మావన జీవశాస్త్రం (హ్యూమన్‌ బయాలజీ) సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆమె త్వరలో నాయల్‌ నాజర్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నారు. నాయల్‌ నాజర్‌, జెన్నీఫర్‌.. ఇద్దరూ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments