Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్‌కు మిత్రోతో వెన్నులో వణుకు ... బ్యాన్ టిక్ టాక్ హ్యాష్‌టాగ్ వైరల్

Webdunia
గురువారం, 28 మే 2020 (18:04 IST)
సోషల్ మీడియాలో యాప్‌లలో ఒకటైన టిక్ టాక్ ఇపుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. దీనికి పోటీగా మేడిన్ ఇండియా మిత్రో యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇది చైనా యాప్ టిక్ టాక్‌కు సరైన పోటీని ఇస్తోంది. ఈ యాప్‌ను ఇప్పటికే 50 లక్షల మంది మొబైల్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 
 
గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమయ్యే ఈ యాప్‌కు ప్రస్తుతం 4.7 రేటింగ్ ఉంది. ఐఐటీ రూర్కీ విద్యార్ధి శివాంక్ అగర్వాల్ ఈ యాప్‌ను రూపొందించాడు. కరోనా వైరస్‌తో పాటు సరిహద్దు వద్ద చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత్‌లో డ్రాగన్ దేశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. 
 
అందుకే చైనా తయారీ వస్తువులు, చైనా టెక్నాలజీ, చైనా యాప్‌ల వాడకాన్ని భారతీయులు క్రమంగా తగ్గిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చైనాపై వ్యతిరేకత పెరుగుతోంది. అందుకేనేమో టిక్‌టాక్ యాప్‌పై దీని ప్రభావం పడినట్లుంది. 
 
బ్యాన్ టిక్ టాక్ అనే హ్యాష్‌టాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీని ప్రభావంతో ప్లే స్టోర్‌లో టిక్‌టాక్ టాప్ ర్యాంకింగ్ నుంచి పడిపోయింది. ప్రస్తుతం దీని రేటింగ్ 1.4కు దిగజారిపోయింది. యాంటీ చైనా సెంటిమెంట్ టిక్‌టాక్ కొంపముంచింది. 
 
అదేసమయంలో భారత్ మిత్రో యాప్‌కు టాప్ రేటింగ్ 4.7 వచ్చింది. డౌన్‌లోడ్‌లు కూడా 5 మిలియన్లను దాటాయి. అత్యంత వేగంగా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందిన యాప్‌గా మిత్రోకు పేరొచ్చింది. 
 
ప్రస్తుతానికి మిత్రో యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే గూగుల్ ప్లే స్టోర్‌లోఅందుబాటులో ఉంది. 8 ఎంబీ కన్నా తక్కువ సైజులో ఉండటం వల్ల స్మార్ట్‌ఫోన్లలో తక్కువ స్పేస్ సరిపోతుంది. త్వరలోనే యాపిల్ స్టోర్లలోనూ ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments