Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

ఆ కిరాతకులను పట్టిస్తే రూ.50 వేల నజరానా!

Advertiesment
Dog
, సోమవారం, 25 మే 2020 (17:32 IST)
ఇద్దరు యువకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. టిక్ టాక్ వీడియో కోసం ఓ మూగ జీవిని నిర్దాక్షిణ్యంగా సజీవంగా చంపేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు కిరాతకులను పట్టించినా, ఆచూకీ తెలిపినా వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇద్దరు యువకులు టిక్ టాక్ వీడియో కోసం ఓ శునకాన్ని చిత్ర హింసలకు గురిచేశారు. కుక్కను నాలుగు కాళ్లు కట్టేసి చెరువులో విసిరేశారు. పైగా, ఆ కుక్కుపైకి లేవకుండా దానిపై రాళ్లు విసిరారు. ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరించి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ కిరాతక యువకుల పట్ల జంతు పరిరక్షణ సంస్థ పెటా ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
సదరు యువకుల్ని పట్టిస్తే 50 వేల రూపాయలు ఇస్తామని నజరానా ప్రకటించింది. 'ఒక అనాగరిక చర్యను మేము కూడా గమనించాం. వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. వారి వివరాలు తెలియజేయండి. వివరాలు తెలిపిన వారికి 50 వేల రూపాయల నజరానా ఇస్తాం' అని పెటా పేర్కొంది. అంతేకాకుండా +91 9820122602 లేదంటే e-mail Info@petaindia.org లకు నేరుగా సమాచారం ఇవ్వవచ్చని విజ్ఞప్తి చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘మేక్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ని లాంఛ్ చేయనున్న ఒకినావా