జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు పోటీగా ఐడియా.. వోల్టే సేవలు.. 10జీబీ డేటా ఫ్రీ

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే వివోఎల్టీఈని జియో, ఎయి‌ర్‌టెల్, వోడాఫోన్‌లు అందుబాటులోకి తెచ్చాయి. తాజ

Webdunia
బుధవారం, 2 మే 2018 (16:11 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే వివోఎల్టీఈని జియో, ఎయి‌ర్‌టెల్, వోడాఫోన్‌లు అందుబాటులోకి తెచ్చాయి. తాజాగా వాయిస్ ఓవర్ ఎల్టీఈ (వివోఎల్టీ) సేవలను ప్రారంభించనున్నట్టు ఐడియా తెలిపింది. దీంతో వినియోగదారులు వీవోఎల్టీఈ సేవలు ఐడియాలో కూడా పొందే అవకాశం  ఐడియా సెల్యూలర్ నెట్వర్క్ కల్పించింది. 
 
వీవోఎల్‌టీఈ సేవల వల్ల వినియోగదారులు ఓ వైపు హైస్పీడ్ మొబైల్ డేటా సేవలను ఆస్వాదిస్తూనే మరోవైపు అత్యంత నాణ్యమైన హెచ్‌డీ వాయిస్ కాల్స్‌ను చేసుకునే సౌలభ్యం వుందని ఐడియా వెల్లడించింది. ఈ ఆఫర్‌ను కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ ఆఫర్‌ను పరిమితం చేసింది. 
 
మే 2 నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలు మహారాష్ట్ర అండ్ గోవా, గుజరాత్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మధ్యప్రదేశ్ అండ్ చత్తీస్‌గఢ్ సర్కిళ్లలో ప్రారంభమవుతాయని ఐడియా స్పష్టం చేసింది.
 
వోల్టే సేవల ప్రారంభాన్ని పురస్కరించుకుని యూజర్లకు 10జీబీ డేటాను ఐడియా ఉచితంగా అందిస్తోంది. మొదటి వోల్టే కాల్ చేసిన అనంతరం 48 గంటల్లోగా యూజర్లకు ఉచిత డేటా లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న 3జీ, 2జీ నెట్ వర్క్‌లను మార్పు చేసి 4జీ వోల్టే సేవలకు ఐడియా సన్నద్ధం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments