కంటి కిందటి నల్లటి వలయాలకు.. పుదీనా ఆకులు..?

కంటి కిందటి నల్లటి వలయాలకు పుదీనా ఆకులు ఎంతో మేలు చేస్తాయి. పుదీనాలోని పోషకాలు కంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే కంటి కింద వుండే డార్క్ సర్కిల్స్‌ను కూడా తొలగిస్తాయి. తాజా పుదీనా ఆకుల నుంచి తీసిన రసాన్

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (14:28 IST)
కంటి కిందటి నల్లటి వలయాలకు పుదీనా ఆకులు ఎంతో మేలు చేస్తాయి. పుదీనాలోని పోషకాలు కంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే కంటి కింద వుండే డార్క్ సర్కిల్స్‌ను కూడా తొలగిస్తాయి. తాజా పుదీనా ఆకుల నుంచి తీసిన రసాన్ని కంటి చుట్టూ అప్లై చేయాలి. పది నిమిషాల పాటు ఆ ప్యాక్‌ను అలానే వుంచి.. చల్లని నీటిలో వుంచిన కాటన్‌తో తుడిచేయాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే.. డార్క్ సర్కిల్స్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే కత్తిరించిన దోసకాయ ముక్కను లేదా దోసకాయ రసాన్ని కంటి చుట్టూ అప్లై చేస్తే కంటి కిందటి నల్లటి వలయాలను తొలగించుకోవచ్చు. అలాగే నిమ్మరసం కూడా డార్క్ సర్కిల్స్‌ను తొలగించడంలో భేష్‌గా పనిచేస్తాయి. వారానికి మూడుసార్లు నిమ్మరసాన్ని కంటికి కింద గల నల్లటి వలయాలతో రాస్తే మంచి ఫలితం వుంటుంది.
 
ఇకపోతే.. రెండు టమోటాల గుజ్జుకు చెంచా నిమ్మరసం, చిటికెడు సున్నిపిండి, పసుపును కలపాలి. ఆ మిశ్రమాన్ని కంటి చుట్టూ.. అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే కంటి కింద చర్మం తెలుపుగా మృదువుగా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో వాకథాన్