జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ 4జీ వోల్టే సర్వీసులు...
						
		
						
				
దేశీయ టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమైంది. ఇందుకోసం 4జీ వోల్టే సర్వీసులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మొబైల్ ఉత్పత్తి తయారీ కంపెనీలతో ఓ ఒప
			
		          
	  
	
		
										
								
																	దేశీయ టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమైంది. ఇందుకోసం 4జీ వోల్టే సర్వీసులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మొబైల్ ఉత్పత్తి తయారీ కంపెనీలతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. తద్వారా 4జీ వోల్టే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి జియోకు చెక్ పెట్టాలని భావిస్తోంది. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఇప్పటికిప్పుడు జియోలా సరికొత్తగా 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చే అవకాశం లేకపోవడంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో జతకట్టి బండిల్ ఆఫర్లు ప్రకటించాలని యోచిస్తోంది. దేశంలో వీవోఎల్టీఈ సేవలను జియో ఒక్కటే అందిస్తుండగా వచ్చే ఏడాది నుంచి ఎయిర్‌టెల్ కూడా వీవోఎల్టీఈ సర్వీసులు అందించనుంది. 
	 
	కాగా, జియో కంటే ముందే దేశీయ మొబైల్ మేకర్ లావా 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే దీని ధర కాస్త ఎక్కువే. ఇప్పుడు  మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, కార్బన్ తదితర కంపెనీలు కూడా 4జీ ఫీచర్ ఫోన్ తయారీపై దృష్టిసారించాయి. దీనిని తనకు అవకాశంగా మార్చుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఆయా కంపెనీలతో కలిసి బండిల్ ఆఫర్లు ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.