Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌక డేటా రేట్లకు చౌక స్మార్ట్ ఫోన్లు.. గూగుల్-జియో ఒక్కటైతే..?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (16:32 IST)
smartphone
అవును చౌక డేటా రేట్లకు చౌక స్మార్ట్ ఫోన్లు.. గూగుల్-జియో ఒక్కటైతే అది సాధ్యమే. ప్రజలకు అందుబాటు ధరలో స్మార్ట్ ఫోన్లను రూపొందించేందుకు దేశీ టెలికం దిగ్గజం జియోతో కలిసి పనిచేస్తున్నట్లు టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని ఆసియా పసిఫిక్‌ విలేకరులతో వర్చువల్‌ సమావేశంలో ఆయన వివరించారు. 
 
అయితే, ఎప్పుడు ప్రవేశపెట్టేదీ, ధర ఎంత ఉంటుందీ వంటి అంశాలను ఆయన వెల్లడించలేదు. చౌక డేటా రేట్లకు చౌక స్మార్ట్‌ఫోన్లు కూడా తోడైతే ఇంటర్నెట్‌ను దేశవ్యాప్తంగా మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడనుంది.
 
ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌ (ఐడీఎఫ్‌) కింద కేటాయించిన 10 బిలియన్‌ డాలర్ల నిధులను వినియోగించేందుకు ఉపయోగపడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పిచాయ్‌ పేర్కొన్నారు. టెక్నాలజీలో కృత్రిమ మేథస్సు సాధనాల వినియోగంలో నైతికత పాటించే విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం ఇవి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తమ సంస్థ ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments