టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) లెక్కల ప్రకారం, రిలయన్స్ జియో 2021 ఏప్రిల్ నెలలో డౌన్‌లోడ్ వేగాన్ని అందించడంలో అగ్రస్థానంలో నిలిచింది. టెల్కో వొడాఫోన్ ఐడియా(VI) అప్‌లోడింగ్‌లో మాత్రం వేగవంతమైన అప్‌లోడ్ స్పీడ్ అందిస్తుంది.
ఇతర టెల్కోలు అందించే వేగంతో పోల్చినప్పుడు జియో తన వినియోగదారులకు సుదీర్ఘ మార్జిన్ ద్వారా వేగవంతమైన నెట్‌వర్క్ అనుభవాన్ని అందిస్తుంది.
ఆపరేటర్లు వొడాఫోన్, ఐడియా సెల్యులార్ రెండూ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా విలీనమయినప్పటికీ రెండు సంస్థల నెట్వర్క్ స్పీడు ట్రాయ్ వేర్వురుగా వెల్లడిస్తుంది.
ఏప్రిల్‌లో జియో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందించిందని, తరువాత వొడాఫోన్, ఐడియా చివరికి భారతి ఎయిర్‌టెల్ స్పీడ్ అందించినట్లుగా ట్రాయ్ తెలిపింది.
రిలయన్స్ జియో 20.1 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తోంది. తరువాత వోడాఫోన్ 7 ఎమ్‌బిపిఎస్ స్పీడ్‌ను అందిస్తోంది, ఐడియా మూడవ స్థానంలో 5.8 ఎమ్‌బిపిఎస్, ఎయిర్‌టెల్ 5 ఎమ్‌బిపిఎస్‌తో ఉన్నాయి.