Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు ఇవే...

రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు ఇవే...
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (11:34 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రియలన్స్ జియో టెలికాం కంపెనీలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఈ మేరకు రిలయన్స్ ముంబై లొకేషన్‌ కేంద్రంగా బీటెక్ లేదా బీఈ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. 
 
అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు 2019, 2020 బ్యాచ్‌ల నుంచి ఐటి, సీఎస్, ఈసీఈ, ఈఈఈ, టెలికాంలలో డిగ్రీ పొంది ఉండాలన్న నిబంధన విధించింది. ఈ అర్హత ఉన్నవారేవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ముందుగా ట్రైనీలుగా తీసుకోని.. ఆ తర్వాత పర్మినెంట్ చేయనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు.
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగ వివరాలు, విద్యార్హత తదితర వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైలో పని చేసే విధంగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఒక యేడాది అనుభవం కలిగి, బీ.టెక్ లేదా బీఈ విద్యాకోర్సును 2019, 2020 బ్యాచ్‌ల నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్స్ లేగా టెలికాం ఇంజనీరింగ్ పూర్తిచేసివుండాలి. 
 
అభ్యర్థులు టీమ్ లీడర్, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలు, నెట్‌వర్క్ పరిజ్ఞానం, 2 జీ, 3 జీ, 4 జీ నెట్‌వర్క్ పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలపై మంచి అగాహనతో పాటు.. పరిజ్ఞానాన్ని కలిగివుండాలి. 
 
ఎంపికయ్యే అభ్యర్థులు ఉద్యోగాల్లో చేసిన తర్వాతర గ్లోబల్ రోమింగ్‌ను ప్రారంభించడానికి సాంకేతిక అవసరాలు, డిజైన్లను రూపొందించడం. అకౌంటింగ్, గుర్తింపు, ప్రమాణీకరణ, పని నిర్వహణ, 2G, 3G, 4G రోమింగ్ సామర్థ్యాలకు సంబంధించిన ప్రణాళికలు, ఉత్పత్తి పరికర బృందంతో సమన్వయం వంటి పనులు చేయాల్సి వుంటుంది. 
 
నెట్‌వర్క్, పనితీరును విశ్లేషించడం.. వాటిని పరిష్కరించడం, అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల రూపకల్పన, ప్రణాళిక, సేవలు తదితర విషయాలను అనలైజ్ చేయడం, కొత్త నవీకరణలు లేదా నెట్‌వర్క్ విస్తరణ లేదా పెట్టుబడుల కోసం సాంకేతిక స్థాయి ప్రతిపాదనల తయారీకి రూపకల్పన చేయడం, సమస్యలను గుర్తించడం, వాటి మెరుగుదల, పరిష్కారం కోసం సిఫార్సులు చేయడం వంటి విధులు నిర్వహించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ సినిమాకైనా, ఏ రోజైనా ఒకటే రేటు: ప్రెస్ రివ్యూ