ఉచితంగా కోవిడ్ ఎసెన్షియల్ కిట్.. జియో 3డీ గ్లాసెస్ కూడా వచ్చేస్తున్నాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:46 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జియో మార్ట్ ద్వారా తొలిసారి ఆర్డర్ చేసే వారికి ఉచితంగానే కోవిడ్ 19 ఎసెన్షియల్ కిట్ అందిస్తున్నట్లు తెలిపింది. ముకేశ్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ ఈ విషయాన్ని తెలిపారు. 
 
జియోమార్ట్ స్థానిక కిరాణా స్టోర్ల భాగస్వామ్యంతో కస్టమర్లకు ఎలా సేవలు అందిస్తోందనే విషయాన్ని వార్షిక సమావేశం సందర్భంగా ఇషా అంబానీ వివరించారు. అలాగే టీచర్లు, విద్యార్థులు ప్రధాన లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో 3డీ గ్లాసెస్‌ను తీసుకువచ్చింది. 
 
జియో గ్లాసెస్ ద్వారా 3డీ వర్చువల్ రూమ్స్, హోలోగ్రాఫిక్ క్లాసెస్ నిర్వహణ వంటివి చేయొచ్చు. అంతేకాకుండా వర్చువల్ మీటింగ్స్ కూడా నిర్వహించొచ్చు. ఇంకా ఫోన్‌తో పనిలేకుండానే ఇతరులకు కాల్ చేయొచ్చు.
 
కేవలం ఎవరికి కాల్ చేయాలో చెబితే చాలు. వారికి కాల్ వెళ్తుంది. కాగా దీని ధర ఎంతో తెలియాల్సి ఉంది. అలాగే జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ 7.7 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.33,733 కోట్లు కావడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments