టెలికాం చార్జీలు భారీ స్థాయిలో పెంచాలి : సునీల్ మిట్టల్

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (15:25 IST)
చార్జీల పెంపుపై భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో తక్కువ స్థాయిలో టెలికాం చార్జీలు ఉన్నాయనీ, వీటిని భారీ స్థాయిలో పెంచాలని సూచించారు. అయితే, టెలికాం చార్జీల పెంపపై నిర్ణయం మాత్రం దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీనే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత టెలికాం చార్జీలింకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయని, మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్‌ పరిస్థితులను పరిశీలించాకే కంపెనీలు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 
 
ఈ విషయంలో ఎయిర్‌టెల్‌ ఒక్కటే ముందడుగు వేయలేదని, ఇండస్ట్రీ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మిట్టల్‌ గతంలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెలకు 16 జీబీ వినియోగానికి కేవలం రూ.160 చార్జీ చెల్లింపు విషాదకరమన్నారు. 
 
ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.200 స్థాయికి పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ ఏఆర్‌పీయూ రూ.162కు పెరిగింది.
 
ఇకపోతే, 5జీ సేవల్లోకి చైనా టెలికాం పరికరాల కంపెనీలను అనుమతించాలా..? వద్దా..? అనే విషయంపై మిట్టల్‌ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారన్నారు. అంతేకాదు, 5జీ స్పెక్ట్రమ్‌ ధరలు కంపెనీలకు అందుబాటులో లేవని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments