ఆపిల్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు...?

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (16:54 IST)
Iphone
స్మార్ట్ ఫోన్లు లేనిదే ప్రస్తుతం పూట గడవదు. వివిధ బ్రాండ్లలో గల స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడం కోసం ఎగబడుతున్నారు. వాటి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ఆపిల్‌ ఐఫోన్‌ను దక్కించుకోవడం మధ్యతరగతివారికి తీరని కల. అందుకే ఈ ఫోన్‌ కొత్త మోడల్‌ రిలీజ్‌ అయినప్పుడల్లా దానిపై జోకులు పేలుస్తారు మిడిల్‌క్లాస్‌ నెటిజన్లు. మన కిడ్నీ అమ్మితే ఈ ఫోన్‌ వస్తుంది అంటూ జోకులు చేసిన సందర్భాలు అనేకం. 
 
అయితే, చైనాకు చెందిన ఓ యువకుడు నిజంగానే ఐఫోన్‌కోసం తన కిడ్నీ అమ్మేశాడు. వచ్చిన డబ్బులతో రెండు ఐఫోన్లు కొన్నాడు. కానీ.. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మంచంపట్టాడు. అతడికి ఫోన్‌పై ఉన్న మక్కువ ప్రాణాల మీదకు వచ్చిందట. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వాంగ్‌షాంగ్‌కు ఆపిల్‌ ఫోన్‌ కొనేందుకు తన మూత్రపిండాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. 
 
అనుకున్నదే తడువుగా తన కిడ్నీని బ్లాక్‌ మార్కెట్లో సుమారు 2, 73,273 అమెరికన్‌ డాలర్లకు అమ్మేశాడు. ఆ డబ్బుతో ఐఫోన్ 4, ఐప్యాడ్ 2ను కొనుగోలు చేశాడు. అయితే, కిడ్నీ అమ్మిన తొమ్మిది నెలల తర్వాత మరో మూత్రపిండంలో లోపం ఏర్పడింది. 
 
దీంతో డయాలసిస్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అతడు బెడ్‌కే పరిమితం కానున్నాడు. ఇదిలా ఉండగా, వాంగ్‌ కిడ్నీ అమ్మిన విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఈ వ్యవహారంలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments