Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైనికులకు గౌరవ వందనంగా దియాను గెలిగించిండి.. ప్రధాని పిలుపు

సైనికులకు గౌరవ వందనంగా దియాను గెలిగించిండి.. ప్రధాని పిలుపు
, శుక్రవారం, 13 నవంబరు 2020 (20:55 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘సరిహద్దుల వెంబడి దేశానికి రక్షణగా నిలుస్తూ, విధులు నిర్వహిస్తున్న సైనికులుగా గౌరవ వందనంగా దీయాను వెలిగించాలని ప్రధాని సూచించారు. భారతదేశ సైనికులు చూపిస్తున్న శ్రేష్టమైన ధ్యైర్యానికి కృతజ్ఞతా భావం అనే పదాలు ఏ మాత్రం న్యాయం చేయలేవని మోడీ అభిప్రాయం వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్న సైనికుల కుటుంబాలకు తాము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రధాని తెలిపారు.
 
అంతేకాకుండా, ఆయన మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా కరోనా చీకట్లలో గడిపిన మన దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు. వ్యవస్థ మొత్తం మళ్లీ క్రమంగా పుంజుకుంటోందని, ఈ నేపథ్యంలో ప్రజల జీవితాల్లో మరింత వెలుగు నింపేందుకు దీపావళి వస్తోందని తెలిపారు. అన్ని చోట్ల అప్పుడే దీపావళి హుషారు నెలకొంది. బాణసంచాను పక్కనపెట్టి, దీపాల వెలుగులో దీపావళిని చేసుకోవడానికి చిన్నా, పెద్దా సిద్ధమయ్యారు. 
 
అలాగే, ప్రధాని మోడీ కూడా ఈ దీపావళిని సైనికుల మధ్య జరుపుకోనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి జవాన్ల మధ్య ఆయన దీపావళి జరుపుకుంటుండటం ఆనవాయతీగా వస్తోంది. అయితే ఎక్కడ జరుపుకోబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
 
గుజరాత్‌లో సైనికులతో కలసి పండుగ జరుపుకుంటారని కొందరు చెపుతుండగా... రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుపుకుంటారని మరికొందరు చెపుతున్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఉంటారు. గత ఏడాది దీపావళికి జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో దీపావళిని మోడీ జరుపుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద పహారా కాసే సైనికులతో కలిసి వేడుకలలో పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్ 2021 రెండవ త్రైమాసంలో 19.8 కోట్ల నిఖరలాభం ఆర్జన