Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్, కేంద్రం మధ్య పోరు: ఇదే చివరి నోటీస్.. ఫైనల్ వార్నింగ్

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (18:02 IST)
ట్విట్టర్, కేంద్రం మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ చ‌ట్టం అమ‌లుపై కేంద్రం, ట్విట్ట‌ర్ సంస్థ‌ల పోరు కొన‌సాగుతుండ‌గా… ఐటీ చ‌ట్టం అమ‌లు చేయాల్సిందేన‌ని ట్విట్ట‌ర్‌కు భార‌త ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది.

ఆదివారం ఉదయం భార‌త ఉప రాష్ట్రప‌తి వెంకయ్య‌నాయుడు అధికారిక గుర్తింపు మార్క్‌ను ట్విట్ట‌ర్‌ను తొలిగించింది. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రాగానే వెన‌క్కి త‌గ్గి పున‌రుద్ధ‌రించింది. 
 
ఆ త‌ర్వాత కొద్దిసేపటికే కేంద్రం ట్విట్ట‌ర్‌కు ఐటీ చ‌ట్టం అమ‌లుపై ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం భారతీయుల‌ను గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది.

కొత్త ఐటీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇదే చివరి నోటీసు అంటూ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ఈ కొత్త ఐటీ చ‌ట్టంపై కేంద్రం, ట్విట్ట‌ర్‌లు కోర్టుల‌ను ఆశ్ర‌యించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments