Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దిరిపోయే ప్లాన్‌తో జియోను దెబ్బతీసేందుకు సిద్ధమైన బీఎస్ఎన్ఎల్

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:00 IST)
జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికం సంస్థలు మూతపడగా, ఆ దెబ్బను తట్టుకుని నిలబడ్డ కొన్ని సంస్థలు జియోను అధిగమించడానికి సర్వశక్తులూ ఉపయోగిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్ఎల్ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది.
 
బిఎస్‌ఎన్ఎల్ ఇప్పటికే అందిస్తున్న రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో తాజాగా మార్పులు చేసింది. ఈ ప్లాన్ క్రింద వినియోగదారులు ఇప్పటి వరకు అపరిమిత లోకల్ మరియు ఎస్‌టీడీ కాల్‌లతో పాటు ప్రతిరోజూ 1 జీబీ డేటాను పొందుతుండగా ఇక నుండి రూ. 349తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు అపరిమిత కాల్‌లతో పాటుగా 3.2 జీబీ డేటాను అందించనుంది. 
 
దీని వ్యాలిడిటీ 64 రోజులుగా ఉంటుంది. అంతే కాకుండా డేటా స్పీడ్‌ను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ ఆఫర్ ఢిల్లీ, ముంబై సర్కిల్స్ మినహా అన్ని ప్రాంతాల వినియోగదారులకు వర్తిస్తుంది.
 
కాగా ఇదే మొత్తానికి జియో 1.5 జీబీ డేటాను అందిస్తుండగా బిఎస్‌ఎన్ఎల్ దానికి రెట్టింపు కంటే ఎక్కువగా 3.2 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఇలాగే కొనసాగితే జియో కూడా నష్టాల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments