Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో యాపిల్ ఫోన్ల విక్రయం ఎప్పటి నుంచంటే..?

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (11:37 IST)
భారత్‌లో ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నవారికి ఇది నిజంగానే ఓ శుభవార్తం. మన దేశంలో ఐఫోన్ల విక్రయం వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. సెప్టెంబరు 9 నుంచి యాపిల్ 16 ఈవెంట్‌ నిర్వహించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. 
 
కాలిఫోర్నియాలో కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటరులో ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు 'యాపిల్ 'ఇట్స్ గ్లో టైమ్' అనే ట్యాగ్‌లైన్ మీడియాకు ఆహ్వానాలు పంపింది. ప్రతి యేడాది మాదిరిగానే ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 16 ఫోన్లను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. యాపిల్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్, ఏఐ-ఆధారిత యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లను ప్రకటించే ఛాన్స్ ఉంది.
 
ఐవోఎస్ 18, ఐప్యాడ్ ఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వియా, వాచ్ ఓఎస్ 11తో పాటు ఇతర ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు ప్రకటించిన తర్వాత యాపిల్ 16 ఫోన్లు విడుదల కానున్నాయి. అయితే ఈ ఏడాది హార్డ్‌వేర్ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 
 
హార్డ్‌‍వేర్ అప్‌డేట్స్‌తో ఐఫోన్ చిప్సెట్ అప్‌డేట్ ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్లను ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేసేలా ఈ మార్పు ఉండవచ్చని కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు మాత్రమే అవసరమైన ప్రాసెసింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి.
 
ఇక యాపిల్ 16 మోడల్ ఫోన్ల విషయానికి వస్తే.. స్క్రీన్ పరిమాణాలు కొద్దిగా పెరగవచ్చు. ఐఫోన్ 16 బేసిక్ మోడల్ కెమెరా అమరిక వరుసను కూడా మార్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చతురస్రం లేఅవుట్‌లో ఉండగా కొత్త మోడల్లో నిలువు అమరికతో వచ్చే ఛాన్స్ ఉంది. కెమెరా అప్ గ్రేడ్లు కూడా ఉండొచ్చు. జూమ్ కంట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా బటన్ ఇచ్చే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments